రాజమండ్రి నగరం
మూలాధార సహస్రసార పరమాం షట్ చక్రలీలావృతాం
ఆనందైకనికేతనామధిశివాం ఐశ్వర్యధారారుణాం
సామాది శృతిమంత్రవైభవపరాం వాణీరమోమాంమృతాం
గాయత్రీం హిమబిందు భాస్కర కళాం శ్రీచక్రికాం భావయే
“నగాయత్ర్యాః పరంమంత్రం నమాతుఃపరదైవతం|"
తల్లిని మించినదైవముగాని, గాయత్రిని మించిన మంత్రంగాని లేదని దీని అర్ధం.ఈ విశ్వాన్ని సృష్ఠించిన పరమాత్శ ఎంత అధ్భుతమో అట్లే మనలను కన్నతల్లి కూడా….ప్రస్తుతానికి వస్తే మంత్రాలన్నింలో గాయత్రి గొప్పదంటారు ఎందుచేతనో తెలుసుకోవాలంటే గాయత్రి అనగా అర్ధం తెలియాలి.
గాయత్రి అనే పదానికి వ్యుత్పత్యర్థం "గయాన్ త్రాయతే " ఇతి గాయత్రి. గయలు అనగా ప్రాణములు అని అర్థం. త్రాయతి అనగా రక్షించునది . ప్రాణములను రక్షించు నది అని అర్ఠం. అమ్మ జన్మనిస్తే గాయత్రీమాత ఆ జన్మించన ప్రాణులను నిరంతరము రక్షించును.
"గాయంతం త్రాయతి" "గాతారం త్రాయతి " అనిగూడా అర్థం చెప్పబడినది. పాడిన వెంటనే లేదా పిలిచిన వెంటనే రక్షించునది అని దీని అర్థం.ఆదిశంకరులు గాయత్రీ మంత్ర భాష్యం చెబుతూ "తత్ సవితుర్ వరేణ్యం" అన్నచోట ప్రసవితృర్ వరేణ్యం అని సంబోధించారు. అంటే ఈ విశ్వం మొత్తాన్ని ప్రసవించిన తల్లి అని నిర్వచించారు. మనం ఆధునిక శాస్త్ర పరిఙ్ఞానం ప్రకారం ఆలోచించినట్లైన సూర్యుని నుండి వచ్చు కాంతి ని వృక్షజాలం గ్రహించి కిరణజన్య సంయొగక్రియ జరిగి పత్రహరితము "పిండి పదార్థం" తయారు చేసుకొని మనకు ఆహార పదార్థములు అందించుట తెలుసు. మనం తినే అన్నం "సూర్యమండలాంతర్గత సవితృ శక్తి" నుండి ఉధ్భవించినదని తేటతెల్లమగుచున్నది. " ఈసందర్భంగా మనం ఉపనిషద్ ప్రతిపాదిత మంత్రాన్ని గమనించిన మనకు పై విషయము రూఢి యగుచున్నది. "ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః, అగ్నే రాపః, అద్యఃపృథివీ. పృధివ్యాం ఓషధిః, ఓషధీభ్యో అన్నం, అన్నాద్భవతి భూతాని జాయంతి. సవితృమండలాంతర్గత శక్తినే మనం గాయత్రి అని పిలుస్తాం. ఆ శక్తి పైన వివరించిన విధంగా మనకు ఆహారమును ఇచ్చి రక్షించుచున్నందున "గయాన్ త్రాయతే" ఇతి గాయత్రి అని నామౌచిత్యము అగుచున్నది …
రాజమహేంద్రవరంలో గాయత్రీ ఆలయం ఒక అధ్భుత నిర్మాణం. యోగ శాస్త్రంలో చెప్పిన విధంగా షట్ చక్రాకారంలో మూలాధారం నుండి ఆఙ్ఞా చక్రం వరకు గల ఆరు చక్రాలకు ప్రతీకలుగా ఆరు అంతస్తులలో నిర్మంచడం జరిగింది. స్వాధిష్ఠాన చక్రం జననావయం వద్డ ఉంటుంది అని చెప్పబడినందున గాయత్రీ మాతను మెదటి అంతస్తులో స్వాధిష్ఠాన చక్రం వద్ద ప్రతిష్ఠించడం జరిగింది. యావత్ సృష్ఠికి కారణమైన గాయత్రి మాతను ఈ ఆలయంలో దర్శించుకున్న వారికి సంతానభాగ్యం కలుగుతుంది అని చెప్పడానికి ఎన్నో దృష్ఠాంతాలు ఉన్నాయి. " సృష్ఠి కత్త్రీ బ్రహ్మరుపా ,గోప్త్రీ గోవిందరూపిణీ, సంహారిణీ రుద్రరూపా అన్నట్లు "ఉదయసంధ్ధ్యా గాయత్రి బ్రాహ్మి, మధ్యాహ్న సంధ్యా గాయత్రి రుద్రాణి,సావిత్రి , సాయం గాయత్రి సరస్వతి, వైష్ణవి సమేతంగా సమగ్ర గాయత్రి దర్మనమిస్తుంది. ఉదయగాయత్రి బ్రాహ్మి లేదా బ్రహ్మాణి ఎర్రటి వర్ణంలో చతుర్ముఖాలు , అక్షమాల ,కమండలం, పద్మం ,దడం,ధరించి బాలారూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది.
ఫోటో
మద్యాహ్న గాయత్రి " రుద్రాణి ఈతల్లినే సావిత్రి అని అంటారు. మనం చేసే గాయత్రీ హోమాలు హవిర్భాగం ఈ తల్లికే ఇస్తుంటాము. సవిత్య్ర ఇదం నమమ అని. ఈ తల్లి రుద్ర రూపిణి కావున పరమశివునిలాగే సజ్జోజాత వామదేవ, అఘోర, తత్పురుష ఈశానాదిపంచముఖాలతో తెల్లటి వర్ణముతో16సంవత్సరాల వయస్సుగల యౌవ్వని గా చక్రము, శూలము, గద అక్షమాల అన్నపాత్ర శంఖము ,పాశము వరద,అభయ హస్తాలతో భక్తులకు దర్శనమిస్తున్నది.
ఫోటో
సాయంకాల గాయత్రి సరస్వతి, వైష్ణవి. ఈ తల్లి సృష్ఠికి ముందు పుట్టిన తల్లి. ఆబ్రహ్మకీట జననీ " ఈతల్లే. " సృష్థికి ముందు పుట్టినతల్లి . ఈ సృష్ఠి చేయిలనే సంకల్ఫంతో నే ఆమె గర్భం ధరించి , తను పురుష రూపం ధరించింది. అప్పటికే గర్భం ధరించి ఉండడంవల్ల యోనిమార్గం లేకపోవడం వల్ల విష్ఞువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మ ఉద్భవించాడని ఒక కథనం కూడా జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది. ఈ తల్లి శంఖ ,చక్ర, ,గద, పద్మాలతో నల్లని వర్ణముతో విష్ఞు స్వరూపంతో భక్తులకు వరాలిస్తున్న తల్లి.
ఫోటో
సమగ్ర గాయత్రి ,శర్వాణి,' - సాలగ్రామ స్వరూపిణి వేదమాత పంచశీర్ష "ముక్త, విదృమ, హేమ, నీల, ధవళ " వర్ణములతో పంచాయతన స్వరూపంతో ఐదు ముఖాలకూ త్రినేత్రములతో చంద్రవంకలతో శంఖ,చక్ర,గద,అంకుశ,పాశ,అభయ,వరద,పద్మ ద్వయంతో దేదీప్యమానంగా మహా త్రిపురసుందరి గా భక్తులకు కొంగు బంగారంగా అమ్మ కొలువైంది.
ఫోటో
సంస్కృత భాషలోని చందస్సులలో గాయత్రీ చందస్సును ""ఛందసాం మాతరం"" అంటారు. ఎనిమిది అక్షరాలుగల ఈఛందస్సు ఎంతో పవిత్రమైన మంత్రము. అష్థాక్షరా గాయత్రీ, గాయత్రీ బ్రహ్మమర్చసమ్ " అన్నారు. గాయత్రీ మంత్రము మూడు పాదాలు కలిగి ఇరువది నాలుగు అక్షరాల తో లౌకికులకు బ్రహ్మచేత విశ్వామిత్ర మహర్షికి దర్శింపబడి, మహర్షి విశ్వామితృని వల్ల లోకమునకు పరిచయము చయబడినది. అంతకు ముందు సృష్టియాది నుండి బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు నిరంతరం గాయత్రి చెయ్యడం వల్లనే సృష్ఠి ,స్థితి ,లయకార్యములు నిర్వహిస్తున్నారు. దేవగురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రాచార్యులు కూడ నిత్య గాయత్రీ స్మరణము చేతనే వారివారికి నిర్దేశించిన కార్యములు నిర్వహించుచున్నారనుటలో సందేహము లేదు. మృత సంజీవని విద్య గాయత్రీ మంత్రము మృత్యుంజయ మంత్రముల సంపుటీకరణమే.. రామాయణ కావ్య కర్త వాల్మీకి మహర్షి తపస్సు చేసిన మంత్రము గాయత్రీ మంత్రమే. బ్రహ్మ నారద మహర్షి ద్వారా గాయత్రీ మంత్రమునే వాల్మీకి మహర్షికి ఉపదేశించెను. అందు వల్లనే మహర్షి రామాయణ రచనలో గాయత్రీ మంత్రము లోని మొదటి అక్షరముతో రామాయణము మొదటి శ్లోకమును మొదలుపెట్టి ప్రతి వెయ్యి శ్లోకముల తరువాత ఒక్కొక్క అక్షరముతో మొదలుపెట్థిఇరువది నాలుగు అక్షరములతో ఇరువదినాలుగు వేల శ్లోకములను మనకు అందించినాడు. అందువల్లనే వాల్మీకి రామాయణము అంత పవిత్రమైనదిగా ప్రసిద్ది నొందినది. గాయత్రీమంత్రద్రష్ఠ అయిన విశ్వామితృడే రామలక్ష్శణులకు బల, అతిబల అనే విద్యలు నేర్పడం జరిగింది. ఆ విద్యలు కూడా గాయత్రీ మంత్రము తోనే కలిసి వున్నవి. రామచంద్రమూర్తి కాకాసుర సంహారము చేసినది కూడా గాయత్రీ మంత్రము తోనే దర్భ మంత్రించి బ్రహ్మాస్త్రముగా ప్రయోగించెను. త్రిజటా స్వప్న వృత్తాంతము గాయత్రీ మంత్ర రహస్యమే. రావణ చ్ఛేదకారిణి బ్రహ్మాస్త్రము గాయత్రీ మంత్ర స్వరూపమే. అట్లే ఇతర అస్త్రాలు వారుణాస్త్రము మొదలైనవి కూడా గాయత్రీ సంపుటీకరణములే. వాటిని గురించి తరువాత ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను. అందు వల్లనే గాయత్రీ పీఠంలో ఇరువది నాలుగు వేల రామాయణ శ్లోకములను ఇత్తడి రేకులపై లిఖించి గోడలపై తాపడం చేయుచున్నాము. ఈ రామాయణ యఙ్ఞంలో భక్తులను భాగస్వాములను చేయుచున్నాము. గాయత్రీ పీఠంలోని అక్షరమాతృకల గురించి,మరియు ఇతర విశేషముల గురించి అటులనే గాయత్రీ మంత్రము లోని యేయే అక్షరములు శరీరములోని యే యే భాగములను రక్షించును అనే విషయములను మిగిలిన విశేషములను తరువాత మీతో పంచుకుంటాను. గాయత్రీ హోమము ఏవిధంగా చెయ్యాలి ఏయె ఫలితములు పొందవచ్చును అనే విషయాలను కూడా తరువాత మీతో ముచ్చటిస్తాను.
సర్వేజనాశ్శుఖినోభవంతు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి