కలియుగ నియమం
శ్లోకం:
ఆయుః పుత్రాన్ యశః స్వర్గం
కీర్తిం పుష్టిం బలం శ్రియమ్ |
పశు-సుఖం ధనం ధాన్యం
ప్రాప్నుయాత్ పితృపూజనాత్ ||
దేవకార్యాదపి సదా
పితృ కార్యం విశిష్యతే |
దేవతాభ్యః పితృణాం హి
పూర్వమప్యాయనం శుభం ||
భావం: శ్రాద్ధ కర్మలతో సంతృప్తి చెందిన పిత్రదేవతలు ఆ కర్తకి దీర్ఘాయువును, సత్సంతానము, కీర్తి, స్వర్గము, బలము, ధనధాన్యపశుసంపద మరియు సంతోషము అనుగ్రహించి ఆశీర్వదిస్తారు.
దైవారాధనకన్నా పిత్రదేవతారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. అందుకే దేవతలకంటే ముందు పిత్రదేవతలను పూజించడం - శ్రాద్ధం చేయడం ద్వారా వారిని సంతోషపెట్టడం మరింత శ్రేయస్కరం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి