శ్లోకం: ఆయుః పుత్రాన్ యశః స్వర్గం కీర్తిం పుష్టిం బలం శ్రియమ్ | పశు-సుఖం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ పితృపూజనాత్ || దేవకార్యాదపి సదా పితృ కార్యం విశిష్యతే | దేవతాభ్యః పితృణాం హి పూర్వమప్యాయనం శుభం || భావం : శ్రాద్ధ కర్మలతో సంతృప్తి చెందిన పిత్రదేవతలు ఆ కర్తకి దీర్ఘాయువును, సత్సంతానము, కీర్తి, స్వర్గము, బలము, ధనధాన్యపశుసంపద మరియు సంతోషము అనుగ్రహించి ఆశీర్వదిస్తారు. దైవారాధనకన్నా పిత్రదేవతారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. అందుకే దేవతలకంటే ముందు పిత్రదేవతలను పూజించడం - శ్రాద్ధం చేయడం ద్వారా వారిని సంతోషపెట్టడం మరింత శ్రేయస్కరం.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి