అంతర్యామి

  మానవజన్మ లభించడం దైవమిచ్చిన గొప్ప బహుమానంగా భావించాలి. మనమంతా

ఇక్కడెందుకున్నాం.... నేనెవరు.... ఈ జీవితానికి అర్థం ఏమిటి... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతే పరిశీలనకు నోచుకోని జీవితాలు అవుతాయి. మనసు గ్రహించిన దాన్నే గుడ్డిగా స్వీకరిస్తూపోవడం, అనాలోచితంగా ఇతరులను అనుసరించడం లాంటి ప్రమాదాల్లో పడతారు. అంతర్గతంగా ప్రయాణించినప్పుడు బహిర్గతంకాని సూక్ష్మమైన సత్యాలు తెలుస్తాయి. లోతైన అవగాహనే జీవితంలో మనిషి వేసుకునే అనేకానేక ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది.

సాదువులు, రుషులు దైవం ఒక సంపూర్ణమని నిర్వచించారు. మార్పులేనిది, కాలంతో సంబంధం
లేనిదీ సత్యం అంటారు... ఒక్క పేరు తప్ప. అది వివిధ సంస్కృతులు, మతాలను అనుసరించి మారుతుంది. ఆశీస్సులు, స్పృహతో కూడిన సామర్థ్యం, శరీరం,
ఇంద్రియాలు, ఆలోచనలతో... మనల్ని ఆ దైవం ప్రపంచంలోకి పంపించాడు. వీటిని ఉపయోగించి, ఎవరికి వారు ప్రేమతో దైవాన్ని తెలుసుకోగలగాలి. శూన్యంనుంచి ఆరంభమైన ప్రయాణం. జ్ఞానసముపార్జనతో లక్ష్యాన్ని తెలుసుకుని ప్రాపంచిక జీవనంలోని సవాళ్లను ఎదుర్కొంటూ, జీవితాన్ని ఒక ఆటలా ఆడుతూనే సాగిపోవాలి.

విస్తృత అవగాహనతో మన ఆత్యలను ఈ భూమినుంచి దైవసాన్నిధ్యానికి చేరుకునే తిరుగు ప్రయాణానికి సిద్ధం చేయాలి. ఆ అద్భుతమైన అందమైన ప్రయాణం ప్రారంభించడానికి అందరికీ అవసరమై ఆ దైవంపట్ల పరిపూర్ణమైన విశ్వాసం. దాంతోపాటు ప్రేమ, భక్తి, వినయం, కృతజ్ఞతాభావం, దైవస్మరణ.... ముఖ్య సాధనాలు. ఈ జీవితం గురించి గ్రహించాల్సింది ఎంతో ఉంది. దైవం మనలోనే ఉన్నాడని గ్రహించి అనుభూతి చెందాలి. అంతరంగ ఆధ్యాత్మిక ప్రయాణానికి బయలుదేరాలి. దైవమార్గంలో అడుగులు వేసేటప్పుడు ఆలోచనలు, కోరికలు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తాయి. కోరిక | తీరగానే క్షణికానందం కలుగుతుంది. దారి మలుపులోనే గమ్యం చేరుకున్నామనే తప్పుడు సంకేతాలందుతాయి. ఆ మలుపు లక్ష్యంవైపు కా గ్రహించాలి. ఆగిపోకుండా లక్ష్యం చేరుకోవాలి.

ధ్యానం చేసేందుకు కూర్చున్నప్పుడు అంతరంగంలో ఆధ్యాత్మిక ప్రపంచాల దృశ్యాలు, శబ్దాలను ఆనందించడానికి మనమే సిద్ధమవుతాం. అనేకమంది శరీరాన్ని స్థిరపరచుకోలేక ఒకటి రెండు రోజుల ప్రయత్నంతో ఆధ్యాత్మిక ప్రయాణం నుంచి వెనుతిరుగుతారు. లక్ష్యసిద్ధికోసం సహనం, పట్టుదల, శ్రద్ధ అవసరం. సమయం, కృషి వల్ల శరీరాన్ని, మనసును నిశ్చలంగా ఉంచవచ్చు. అప్పుడు అంతరంగ ప్రపంచ ద్వారాలు తెరుచుకుంటాయి. దైవంతోనే సంబంధం ఏర్పడినప్పుడు కలిగే ఆ అనుభూతి వర్ణనాతీతం.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కలియుగ నియమం